అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడు అవుతారని ప్రఖ్యాత ఆర్థికవేత్త క్రిస్టోఫర్ బెరార్డ్ అంచనా వేశారు. అనేక కోణాల్లో ఆయన తన రిపోర్టును తయారు చేశారు. బెట్టింగ్, ఎన్నికల విశ్లేషణ, ఫైనాన్షియల్ మార్కెట్ల సంకేతాల ద్వారా ఆ విషయం స్పష్టం అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఆర్థికవేత్తగా క్రిస్టోఫర్‌కు పేరున్నది. నవంబర్ 5వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ కొట్టనున్నట్లు ఆయన అంచనా వేశారు. బెట్టింగ్ మార్కెట్లు, ఎన్నికల సరళ, ఎలక్షన్ మాడ్యులర్స్ అంచనాలు, ఫైనాన్షియల్ మార్కెట్ల ఆధారంగా ట్రంప్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు పేర్కొన్నారు.