Namaste NRI

దివాళీ వేడుకల్లో అమెరికా రాయబారి 

భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి  మరోసారి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్‌ హిట్‌ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. విక్కీ కౌశల్‌ నటించిన బ్యాడ్‌ న్యూజ్‌  చిత్రంలోని తౌబా తౌబా అని సాగే హిట్‌ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, కళ్లజోడు పెట్టుకుని గార్సెట్టి చేసిన డ్యాన్స్‌ చేశారు.  గార్సెట్టి ఇలా తన డ్యాన్స్‌ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలా తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు.

గతేడాది దీపావళి వేడుకల్లో కూడా గార్సెట్టి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. షారుక్‌ఖాన్‌ నటించిన దిల్‌ సే  చిత్రంలోని ఛయ్య ఛయ్యా పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు గతేడాది ఢిల్లీలోని సీఆర్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన దుర్గా పూజలో పాల్గొన్న గార్సెట్టి సంప్రదాయ ధనుచి  నృత్యంతో ఆకట్టుకున్నారు.

Social Share Spread Message

Latest News