Skip to main content

Namaste NRI

లక్కీ భాస్కర్‌ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది  : సూర్యదేవర నాగవంశీ

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన లక్కీ భాస్కర్‌ చిత్రం నేడు ప్రేక్షకుల ముందు కొస్తున్నది.   బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్‌షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ విడుదలకు ముందే లక్కీ భాస్కర్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. నిర్మాతగా ఈ సినిమా ఎంతో సంతృప్తిని చ్చింది. ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.  

ప్రీమియర్స్‌కు మంచి స్పందన వస్తుండటంతో షోస్‌ సంఖ్య కూడా పెంచాం. బ్యాంకింగ్‌ నేపథ్యంలో థ్రిల్లర్‌ జోనర్‌లో నడిచే ఫ్యామిలీ కథాంశమిది. మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడనే పాయింట్‌ చుట్టూ కథ నడుస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ భాస్కర్‌ పాత్రతో కలిసి ప్రయాణం చేస్తారు. అతను గెలవాలని కోరుకుంటారు. ఈ సినిమాలో హీరో ఎవరినీ మోసం చేయకుండా తన తెలివితేటలతో డబ్బు సంపాదిస్తాడు. ఆ పాయింట్‌ ఆసక్తికంరగా అనిపిస్తుంది అన్నారు. ఈ సినిమాలో ఎలాంటి సందేశాలు ఉండవనీ, అయితే సినిమా చూసిన వారు మాత్రం మంచి అనుభూతితో బయటకు వస్తారని నాగవంశీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events