Skip to main content

Namaste NRI

అనుష్క బర్త్‌డే స్పెషల్‌.. ఆసక్తిగా ఘాటి గ్లింప్స్

అగ్ర నాయిక అనుష్క మరో వైవిధ్యభరితమైన సినిమా ఘాటి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం  వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. అనుష్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు.  శరీరం మొత్తం ట్రైబల్‌ టాటూస్‌తో చేతిలో కొడవలి పట్టుకొని, ఘాట్‌ రోడ్డులో ఆగివున్న ఓ బస్సులోకి అనుష్క ఎంట్రీ కావడం, అందులో ఉన్న ఓ వ్యక్తి మెడను కర్కశంగా కోస్తూ, అద్దంలో తనని తాను చూసుకునే సీన్‌తో టీజర్‌ ఉత్కంఠను పంచింది. అనుష్క లుక్స్‌, స్క్రీన్‌ప్రజెన్స్‌ ఇంటెన్స్‌గా అనిపించింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, అనుష్క పాత్ర శక్తివంతంగా ఉంటుందని, చిత్రీకరణ చివరి దశలో ఉందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, దర్శకత్వం, రచన: క్రిష్‌ జాగర్లమూడి.

Social Share Spread Message

Latest News