అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమిపై అధ్యక్షుడు జో బైడెన్‌ను డెమోక్రాట్లు నిందిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆలస్యంగా వైదొలగడమే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమని ఆరోపిస్తు న్నారు. బైడెన్ త్వరగా విరమించుకొని ఉంటే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇతర అభ్యర్థులూ పోటీ పడేవారు. ఈ పోటీలో కమల మెరుగ్గా నిలబడి మరింత బలమైన అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడేవారు అని డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ ఆరోపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-30.jpg)
బైడెన్ ఆరోగ్యంపై అమెరికా ప్రజలకు డెమోక్రాటిక్ పార్టీ అబద్ధాలు చెప్పింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ నిర్వహించలేదు అని మరో నేత బిల్ ఆక్‌మాన్ పేర్కొన్నారు. ట్రంప్‌తో జరిగిన మొదటి చర్చా కార్యక్రమంలో జో బైడెన్ విఫలమైన నాటి నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రాటిక్ నేతలు కోరుతూ వచ్చారు. దీంతో తప్పనిసరై పోటీ నుంచి చివర్లో తప్పుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-30.jpg)