![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Mayfair-28.jpg)
తమ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని హమాస్ నేతలను ఖతార్ ఆదేశించింది. 2012 నుంచి హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్ రాజధాని దోహాలో కొనసాగుతున్నది. హమాస్ ముఖ్య నేతలు ఖతార్ నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి విరామం పలికి, బందీలను విడుదల చేయించేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ హమాస్‌తో కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాయి. తాజాగా అక్టోబర్ మధ్యలోనూ చర్చలు జరగగా, ఒప్పంద ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. దీంతో హమాస్ నేతలకు ఆశ్రయం కల్పించొద్దని ఖతార్‌పై అమెరికా ఒత్తిడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమ దేశాన్ని వీడాలని 10 రోజుల క్రితం హమాస్ నేతలకు ఖతార్ తేల్చిచెప్పింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Ixora-28.png)