భారత్‌లో యాపిల్ ఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్స్, యాపిల్ వాచ్ వినియోగదార్లను కేంద్రం హెచ్చరించింది. యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపాలు తలెత్తే అవకాశముందని, యూజర్ల వ్యక్తిగత సమాచారం గల్లంతయ్యే ముప్పు పొంచివుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్యూరిటీ అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) యాపిల్ యూజర్ల కోసం మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ప్రస్తుతం యూజర్లు వాడుతున్న పలు యాపిల్ ఉత్పత్తుల్లోని సాఫ్ట్‌వేర్ ఔట్‌డేటెడ్‌గా పేర్కొన్నది. సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌లోని లోపాల్ని ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు యూజర్ల డాటా దొంగతనం, డాటా తారుమారు, సేవల్ని అడ్డుకోవటం వంటివి జరగవచ్చునని తెలిపింది.