Skip to main content

Namaste NRI

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బోయింగ్

విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్‌   తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిం చింది. ముందుగా చెప్పినట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందికి ఉద్వాసన పలికింది. అంటే 17 వేల మందిపై వేటు వేసింది.  సియాటెల్‌ ప్రాంతంలో 33,000 మంది కార్మికులు ఇటీవలే సమ్మె కు దిగిన విషయం తెలిసిందే. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా సంస్థ మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం చవి చూసింది. ఈ విషయాన్ని బోయింగ్‌ సంస్థ గత నెలలో వెల్లడించింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్‌ తెలిపారు.

రానున్న రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తగ్గించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటి వ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు  అని ఆయన గత నెల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సంస్థ తాజా గా చర్యలు చేపట్టింది. మొత్తం 17,000 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ నోటీసులు జారీ చేస్తోంది. అమెరికా కేంద్రం గా పనిచేస్తున్న పలువురు ఉద్యుగులు ఇప్పటికే ఈ లేఆఫ్‌ నోటీసులు అందుకున్నారు. వారు నిబంధనలకు అనుగుణంగా జనవరి వరకూ పేరోల్‌లో ఉండనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events