16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలి యా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా వినియోగంపై ఇలా నిషేధం విధిస్తూ ఒక దేశం బిల్లు తేవడం ప్రపంచంలోనే తొలిసారి. అలాగే 18 ఏండ్ల లోపు యువత ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ వీక్షణపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తున్నది. 21వ శతాబ్దపు సవాళ్లకు 20వ శతాబ్దపు స్పందన తప్ప దని డిజిటల్ ఇండస్ట్రీ అడ్వకేట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్ భద్రత అనేది తల్లిదండ్రులకు కష్టతర మైన సవాళ్లలో ఒకటని ఆ దేశ ప్రసార శాఖ మంత్రి మేఖేల్ రౌలాండ్ పేర్కొన్నారు. 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 33 మిలియన్ అమెరికా డాలర్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.