బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో 2023 మే నెలలో కింగ్ చార్లస్-3 రాజయ్యాడు. ఈ సందర్భంగా రాజు పట్టాభిషేకానికి ఏకంగా 72 మిలియన్ పౌండ్లను ఖర్చు చేశారు. మన భారతదేశ కరెన్సీలో ఇది ఏకంగా రూ.765 కోట్లు. ఈ మేరకు బ్రిటన్ సర్కారు ఒక నివేదికను వెల్లడించింది. బ్రిటన్ రాజుగా చార్లెస్‌కు గత ఏడాది మే 6న పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌కు 40వ చక్రవర్తిగా ఆయన గుర్తింపు పొందారు. వెస్ట్‌మినిస్టర్ అబేలో సంప్రదా యబద్ధంగా ఈ పట్టాభిషేకం వేడుక జరిగింది. ఈ వేడుకలకు భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్ హాజరయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా ప్రతినిధులు తరలి వెళ్లారు. పట్టాభిషేకం వేడుక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని, పోలీసింగ్ కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని బ్రిటన్ సాంస్కృతిక శాఖ తెలిపింది.