Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన 10 శాతం సుంకాలను అమెరికా వాణిజ్య న్యాయస్థానం కొట్టివేసింది. 1970ల నాటి వాణిజ్య చట్టం ప్రకారం ఈ చర్యలు చట్టబద్ధంగా సమర్థనీయం కాదని కోర్టు తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులు కేవలం రెండు చిన్న వ్యాపారాలకు, వాషింగ్టన్‌ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తుంది.

అప్పీల్‌ ప్రక్రియ జరిగేంత వరకు ఇతర దిగుమతిదారులందరిపై సుంకాలు అమలులో ఉండేలా ఇది అనుమతిస్తుంది. ఫిబ్రవరి 24న ప్రవేశపెట్టిన 10 శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను సవాలు చేస్తూ బొమ్మల తయారీ సంస్థ బేసిక్‌ ఫన్‌, మసాలా దినుసుల దిగుమతిదారు బర్లాప్‌ అండ్‌ బారెల్‌, వాషింగ్టన్‌ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం 2:1 తీర్పును వెలువరించింది. వ్యాపార సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ఇది చాలా తొందరపాటు అవుతుందని పేర్కొంటూ ఒక న్యాయమూర్తి విభేదించారు. ప్రధానంగా డెమోక్రటిక్‌ పార్టీ నేతృత్వంలోని 24 రాష్ర్టాల కూటమి కోరిన విస్తృతమైన ఇంజంక్షన్‌ను మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.

Social Share Spread Message

Latest News