తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూ జెర్సీ లో జరిగిన ఉగాది వేడుకలు, పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడు , ఉపేంద్ర చివుకుల , గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు మధుసూదన్ రావు అన్నా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ డా. నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ భాషే సాంస్కృతిక వారధి, ఒక జాతి ప్రతీకతను అస్తిత్వన్ని చాటి చెప్పేది మాతృభాషే. తెలుగు వారి సమక్షంలో ఈ ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నన్ను వైద్య ఆరోగ్య రంగానికి నన్ను ప్రత్యేక సలహాదారుగా నియమించారని తెలిపారు.


తెలుగు కళా సమితి అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నా మాట్లాడుతూ తనకు దక్కిన రెండు సంవత్సరాల సేవను బాధ్యతతో సంతోషంగా నిర్వహించానని తెలిపారు. తెలుగు వారి సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుతున్నందుకు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులను మన్నవ సుబ్బారావు అభినందించారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాధించదని ఆర్పీ పట్నాయక్ అన్నారు. టిఎఫ్ఏఎస్ మాజీ అధ్యక్షులు దాము గేదెలకు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోకిల మంజులశ్రీ పంచాంగం శ్రవణం చేశారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది.


ఈ కార్యక్రమంలో 2024-26 టిఎఫ్ఏఎస్ కార్యవర్గ సభ్యులు సత్య వెంకటతాత, ప్రసాద్ ఊటుకూరి,వాణి కూనిశెట్టి ,శేషగిరిరావు కంభంనెట్టు , అరుంధతి సావెల్లి , వరలక్ష్మి రాధాకృష్ణ, లతా మాదిశెట్టి , లోకంధర్ పాల్గొన్నారు. స్వర సామ్రాట్ డా. టి శరత్ చంద్ర, రంగస్థల కళాకారులు అశోక్ చింతకుంటను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. 2026-28 కిగాను అధ్యక్షురాలుగా ఎన్నికైన ఉమా మాకం తోపాటు ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులతో సుధాకర్ ఉప్పల ప్రమాణ స్వీకారం చేయించారు.





























