Skip to main content

Namaste NRI

రాయవలస మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది : హీరో కార్తీక్ జయంతి

కార్తిక్‌ జయంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం రాయవలస. రాధిక జయంతి దర్శకత్వం. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ జే నిర్మిస్తున్నారు. టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి యువహీరో ఆకాష్‌ జగన్నాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భావోద్వేగాలు కలబోసిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, ఈ సినిమా ద్వారా తన కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నానని దర్శకురాలు రాధిక జయంతి చెప్పారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథాంశమిదని, తప్పకుండా అందరికి కనెక్ట్‌ అవుతుందని హీరో కార్తీక్‌ అన్నారు. గతంలో షార్ట్స్‌ ఫిలిమ్స్‌, వెబ్‌సిరీస్‌లు తీసిన తమ సంస్థ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నదని నిర్మాత గోపీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ బాలా, కథ, సంభాషణలు: రాఖీ ఏ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి.

Social Share Spread Message

Latest News