Skip to main content

Namaste NRI

అనకాపల్లి నుంచి మాస్ నంబర్ లబ్బరు బొమ్మ సాంగ్ రిలీజ్

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య విశిష్ట జంటగా నటిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ థ్రిల్లర్‌ అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లబ్బరు బొమ్మ అంటూ సాగే ఓ మాస్‌ గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. రాంబాబు గోశాల రాసిన ఈ పాటను దేవ్‌జండ్‌ స్వరపరచగా, శ్రీకృష్ణ, సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. తారక్‌ పొన్నప్ప, నందినీరాయ్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. మాస్‌ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ పాటను దర్శకుడు ఖగేష్‌ తమ్మినేని తెరకెక్కించారు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కథ, కథనం: నక్కిన త్రినాథరావు, కెమెరా: మాయా.వి, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌.

Social Share Spread Message

Latest News