Skip to main content

Namaste NRI

మూడో ప్రపంచయుద్ధం మొదలైంది!

ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. పాశ్చాత్య దేశాల వల్లే ఈ యుద్ధం తీవ్రతరమవుతున్నదని ఆరోపించారు. ఈ ఘర్షణ మరింత ఉధృతమైతే, ప్రతీకార చర్యలు చేపట్టే హక్కు రష్యాకు ఉందన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చి, ఘర్షణ ను ఎగదోస్తున్న దేశాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచం లో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం అమెరికాయేనని పుతిన్‌ పునరుద్ఘాటించారు.

2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని ఉక్రెయిన్‌ మాజీ మిలిటరీ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ వలెరీ జలుజ్నీ చెప్పారు. ఉక్రెయిన్‌స్క యూపీ100 అవార్డ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ఈ యుద్ధంలో రష్యా నియంతృత్వ మిత్రులు పాల్గొంటున్నందువల్ల, ఇది అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందని చెప్పవచ్చున న్నారు. ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్‌ ముందు నిల్చుందని, ఇరానియన్‌ షాహెదీస్‌ బాహాటంగానే ఉక్రెయిన్‌ ప్రజలను చంపుతున్నారని తెలిపారు. చైనా ఆయుధాలు యుద్ధంలో కనిపిస్తున్నాయని చెప్పారు.

Social Share Spread Message

Latest News