Namaste NRI

ఆకస్ లో జపాన్ కు ఇండియాకు చోటు లేదు

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా కొత్త కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ దేశాలతో ఆకస్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 15వ తేదీన ఆకస్‌ గ్రూపును అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఆ కూటమిలో బ్రిటన్‌ తన వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాముల టెక్నాలజీని ఆస్ట్రేలియాకు ఇవ్వనున్నది. అయితే ఈ కూటమిలో ఇండియా, జపాన్‌ దేశాలను చేర్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ కూటమిలో మరో దేశాన్ని చేర్చుకోవడం ఫ్రాన్సుకు బైడెన్‌ స్పష్టం చేశారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెట్రకరీ జెన్‌ సాకి తెలిపారు.

Social Share Spread Message

Latest News