Namaste NRI

న్యూజెర్సీలో ఘనంగా తెలుగు కళా సమితి 40 వసంతాల వేడుకలు, దీపావళి సంబరాలు

అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళాసమితి (టీఎఫ్‌ఏఎస్‌) 40వ వార్షికోత్సవంతో పాటు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన తెలుగువారి వివరాలతో రూపొందించిన తెలుగుజ్యోతి పుస్తకాన్ని టీఎఫ్‌ఏఎస్‌ అధ్యక్షులు మధు అన్నా, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చివుకుల, శంకరమంచి రఘుశర్మ, స్వాతి అట్లూరి తదితరులు ఆవిష్కరించారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రముఖ కమెడియన్‌ శివారెడ్డి షో, మ్యూజికల్‌ నైట్‌తో పాటు సాహిత్య, క్రికెట్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ పోటీలు నిర్వహించా రు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మధు అన్నా మాట్లాడుతూ  జాతి అస్తిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని, అందుకే అమెరికాలో పుట్టిన తెలుగువారి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నట్టు వెల్లడిరచారు. అమెరికాలో తెలుగు భాషా వికాసానికి టీఎఫ్‌ఏఎస్‌ కృషి చేస్తోందని మన్నవ సుబ్బారావు కొనియాడారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అక్కడ కంటే కూడా ఇక్కడే పండగులను, ఇతర వేడుకలను క్రమం తప్పకుండా జరుపుతున్నారు. తెలుగుతనాన్ని మొత్తాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగుభాషకు, తెలుగుజాతికి గుర్తింపు తెస్తున్నారు. భాషను చంపేసే తరంగా మనం మిగలకూడదని తెలిపారు. మాతృభాష మృతభాష కాకుడదని టీఎఫ్ఏఎస్ సంస్థ బాగా కృషిచేస్తోంది అని కితాబునిచ్చారు.

ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ భాష, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీఎఫ్ఏఎస్ వారు చేస్తున్న సామాజిక, సాంస్కృతిక సేవను అభినందించారు.

ఈ కార్యక్రమంలో శేషగిరి కంభంమెట్టు, ప్రసాద్ వూటుకూరి, వాణి కూనిశెట్టి, లత మాడిశెట్టి, దాము గేదెల, వాసిరెడ్డి రామకృష్ణ, మందాడి శ్రీహరి, భీమినేని శ్రీనివాస్, భాను మాగులూరి, రమేష్ అవిర్నేని, లోకేందర్ గిర్కాల, అరుంధతి శాకవల్లి, వెంకట సత్య తాతా, వరలక్ష్మి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. పసందైన విందుతో కార్యక్రమం ముగిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress