Skip to main content

Namaste NRI

ఫియర్ విడుదల తేది ఖరారు

వేదిక లీడ్‌ రోల్‌ చేస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫియర్. డా.హరిత గోగినేని ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. డా.వంకి పెంచెలయ్య, ఏఆర్‌ అభి నిర్మాతలు. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో 70కి పైగా ఈ సినిమా అవార్డులను గెలుచుకున్నదని మేకర్స్‌ చెబుతున్నారు.  ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా సినిమా ను విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇదని మేకర్స్‌ చెబుతు న్నారు. అరవింద్‌ కృష్ణ, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురువిల్ల, సయాజీ షిండే, సత్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.  డిసెంబర్‌ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సహనిర్మాత: సుజాత రెడ్డి.

Social Share Spread Message

Latest News