Skip to main content

Namaste NRI

సంక్రాంతి వస్తున్నాం.. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టబోతున్నారు. డిసెంబర్‌ 3న తొలి పాట విడుదలకానుంది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందించిన ఈ పాటను రమణ గోగుల ఆలపించారు.భాస్కరభట్ల రచించారు. గోదావరి గట్టుపై, వెన్నెల రాత్రి నేపథ్యంలో రొమాంటిక్‌ గీతంగా అలరిస్తుందని, వెంకటేష్‌, ఐశ్వర్యరాజేష్‌ మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది.

 ప్రస్తుతం వెంకటేష్‌, మీనాక్షిచౌదరిలపై డెహ్రాడూన్‌, ముస్సోరీ, రిషికేశ్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఓ పాటను తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. ఉప్రేంద లిమాయే, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు.  సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News