Skip to main content

Namaste NRI

నందమూరి మోక్షజ్ఞ న్యూ లుక్ .. ఏమన్నా ఉన్నాడా

అగ్ర నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తొలి చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభంకానుంది. పౌరాణిక ఇతిహాసం ప్రేరణతో రూపొందించిన ఈ కథలో మోక్షజ్ఞ పాత్రను నవ్యరీతిలో తీర్చిదిద్దబోతున్నారని తెలిసింది. ఇప్పటికే నటన, నృత్యాలు, పోరాటఘట్టాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన మోక్షజ్ఞ, లుక్స్‌, స్టైల్  పరంగా సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ఛార్మింగ్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News