Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్న జెస్టిన్‌ ట్రుడో 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌  ఘన విజయం సాధించారు. జనవరిలో బాధ్యతలు తీసుకోనున్నా రు. అయితే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఇదే విషయమై ట్రంప్‌తో చర్చించేందుకు కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రుడో సిద్ధమయ్యారు. ఇరువురు నేతలు శనివారం భేటీ కానున్నట్లు తెలుస్తున్నది. ఫ్లోరిడాలోని ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ సమావేశం జరుగనుంది. అయితే ఈ భేటీకి సంబంధించి కెనడా ప్రధాని కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Social Share Spread Message

Latest News