నూతన తారాగణంతో దర్శకుడు రూపొందిస్తున్న యూత్‌ఫుల్ సోషల్‌డ్రామా యుఫోరియా. ప్రస్తుతం సమాజం లో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్‌ను దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో చర్చిస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక భూమిక కీలక పాత్రను పోషిస్తున్నది. 20 ఏండ్ల క్రితం మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రంలో భూమిక నాయికగా నటించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటం విశేషం.

ఈ సందర్భంగా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో భూమిక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుం దని, ఆమె పాత్ర విషయంలో దర్శకుడు గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చిత్ర బృందం పేర్కొం ది. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లికితా యలమంచిలి తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్నందిస్తున్నారు.
