దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్షుడు యోల్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. యోల్ పదవీచ్యుతుడు కావటం ఖాయంలా కన్పించింది. ఈలోపు అధ్యక్ష పదవి నుంచి యోల్ తప్పుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి. యోల్, రక్షణమంత్రి కిమ్ యోంగ్ సహా క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేందు కు సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు. మంగళవారం రాత్రి క్యాబినెట్ సమావేశం అనంతరం యోల్ మార్షల్ లా విధింపుపై వెనక్కి తగ్గారు. మార్షల్ లా విధింపును వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.