అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వం. రాజేష్ దండా నిర్మాత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ దండా మాట్లాడుతూ ఈ కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తొచ్చేది. నరేష్ డేట్స్ కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా తీశా అన్నారు.
1980 దశకంలో కథ నడుస్తుంది. బచ్చలమల్లి అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తయారుచేసిన ఫిక్షనల్ స్టోరీ ఇది. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే జీవితంలో ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సివస్తుందనే అంశాల ను చూపించాం అన్నారు. ఓ ప్రేక్షకుడిలా తాను కథలు వింటానని, ఒకే మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేయాలన్నదే తన లక్ష్యమని రాజేష్ దండా తెలిపారు. ఇప్పటివరకు నరేష్‌తో సీరియస్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశానని, భవిష్యత్తులో ఆయనతో ఫుల్‌లెంగ్త్ కామెడీ మూవీ తీసే ఆలోచన ఉందని ఆయన చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.