వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణా రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారుతుంది. ఆ తర్వాత బీచ్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వీటిని ఛేదించడంలో పోలీసులు విఫలమవడంతో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌కు బాధ్యతలను అప్పగిస్తారు.
గ్రామంలోని ప్రేమజంట సహాయంతో అతను హత్యా రహస్యాలను ఎలా బయటపెట్టాడనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. కేసును ఛేదించే క్రమంలో వెన్నెల కిషోర్ కనబరచిన తెలివితేటలు, సెన్సాఫ్ హ్యూమర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాత వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహగుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాణ సంస్థ: శ్రీ గణపతి సినిమాస్, రచన-దర్శకత్వం: రైటర్ మోహన్.