తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు వీసా-ఫ్రీ-ఎంట్రీ కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. వీసా రహిత ప్రవేశం, దేశాల జాబితాలో భారత్ సహా మరో 62 దేశాలను చేర్చినట్టు రష్యా ఒక ప్రకటన జారీచేసింది. కేవలం పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకున్నవాళ్లకు, అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో వీసా-ఫ్రీ-ఎంట్రీ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.