Namaste NRI

సంక్రాంతికి వస్తున్నాం.. మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది

నాలైఫ్‌లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా, పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా. ట్రైనర్‌గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా.. వస్తునే వెలుగేదో నింపింది ఆ కళ్లలోనా.. చిత్రంగా ఆ రూపం.. చూపుల్లో చిక్కిందే.. మత్తిచ్చే ఓ ధూపం.. ఊపిరిలో జల్లిందే  ఈ సాహిత్యం వింటే ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ అబ్బాయి పాడే పాట అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయితే దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇంకాస్త కొత్తగా ఆలోచించాడు.  తన ప్రేయసి జ్ఞాపకాలను భార్యతో పంచుకుంటూ భర్త పాడే పాటగా దీన్ని చిత్రీకరించాడు. ఆ భర్త విక్టరీ వెంకటేశ్‌ కాగా, భార్య ఐశ్వర్య రాజేష్‌. ఇక ప్రేయసి ఎవరో తెలిసిందేగా.  మీనాక్షి చౌదరి. రానున్న సంక్రాంతికి సందడి ఏ స్థాయిలో ఉండనుందో ఈ పాటతో చెప్పేశారు సంక్రాంతికి వస్తున్నా టీమ్‌. గురువారం విడుదలైన ఈ రెండో పాట  తొలిపాటను మించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచి, ప్రణవి ఆచార్యతో కలిసి ఆలపించారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, తొలిపాటగా విడుదలైన గోదారి గట్టు కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress