చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ను ఎగదోస్తున్న అమెరికా ఇప్పుడు ఆ దీవికి 571.3 మిలియన్ల డాలర్ల మిలిటరీ సాయం అందించాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్ హడావుడిగా దీనికి ఆమోదం తెలిపారు. 265 మిలియన్ల డాలర్ల విలువ చేసే సైనిక పరికరాలను అమెరికా అందజేయనుంది. అంతకుమించి వివరాలను వైట్‌హౌస్ పేర్కొనలేదు. తైవాన్ జలసంధిలో శాంతి భద్రతలకు హామీ కల్పించేలా భద్రతాపరమైన అంశాలపై ఉభయ పక్షాలు సన్నిహితంగా పనిచేస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది. 265 మిలియన్ల డాలర్ల విలువ చేసే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ ఆధునీకరణ పరికరాలను తైవాన్‌కు విక్రయించేందుకు విదేశాంగ శాఖ కూడా ఆమోదం తెలిపింది. పెంటగన్ పేర్కొంది. ఈ మిలటరీ సామాగ్రితో తమ కమాండ్, కంట్రోల్ వ్యవస్థలు ఆధునీకరించబడతాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.