వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన లీగల్ థ్రిల్లర్ లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకుడు. శాంతమ్మ, మలికిరెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాను లాయర్ కాబట్టే రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని తలంపుతో ఈ కథ తయారు చేసుకున్నానని, ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా రూపొందిందని హీరో వీర్ రెడ్డి తెలిపారు. ఇంకా దర్శకుడు రవి గోగుల, డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్‌చౌదరి, నిర్మాతలు శాంతమ్మ, మలికిరెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జాక్సన్ జాన్సన్, అనూష్ గోరక్, సంగీతం: శంకర్ తమిరి, నిర్మాణం: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్.