హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయె ల్ తొలిసారిగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాదు లు ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తున్నారని, వారికి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నానం టూ హమాస్, హెజ్బొల్లాలను ఓడించామన్నారు. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని, సిరియాలో బషర్ అల్ అసద్ పాలననను పడగొట్టామని తెలిపారు. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చామని వెల్లడించా రు. యెమెన్‌లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు.