రాజస్థాన్‌లో అనేక కేసులను ఎదుర్కొంటున్న డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలోని స్టాక్‌టన్ నగరంలో హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరిన సునీల్ యాదవ్ రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం కేసులో ప్రధాన సూత్రధారి. సునీల్ యాదవ్‌ను తామే చంపామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొదారా ప్రకటించాడు. తమ సోదరుడు అంకిత్ భాడు ఎన్‌కౌంటర్‌లో మరణించ డం వెనుక సునీల్ యాదవ్ ఉన్నాడని, పంజాబ్ పోలీసులతో చేతులు కలిపి అతనే ఈ ఎన్‌కౌంటర్ చేయించాడని రోహిత్ గొదారా ఆరోపించాడు. ఇందుకు ప్రతీకారంగానే తాము సునీల్‌ను హతమార్చినట్టు తెలిపాడు.