నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ది ఇండియా హౌస్. సాయి మంజ్రేకర్ కథానాయిక. రామ్‌వంశీకృష్ణ దర్శకత్వం. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అగ్ర హీరో రామ్‌చరణ్, విక్రమ్‌రెడ్డి.వి భాగస్తులుగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. సాయి మంజ్రేకర్ పుట్టిన రోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న సతి పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సంప్రదాయ చీరకట్టులో ప్రియుడి గురించి ఆలోచిస్తూ విరహ వేదన అనుభవిస్తున్నట్టుగా ఈ లుక్‌లో సాయి మంజ్రేకర్ కనిపిస్తున్నది.
1905లో జరిగే పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నదని, ప్రేమ, విప్లవం నేపథ్యం ఈ సినిమా కథ ఉంటుంద ని మేకర్స్ తెలిపారు. అనుపమ్‌ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సమర్పణ: రామ్‌చరణ్, నిర్మాణం: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్.