Skip to main content

Namaste NRI

విష్వక్‌ సేన్‌ లైలా నుంచి సోను మోడల్‌ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

యువహీరో విశ్వక్‌సేన్‌ నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ లైలా. ఆకాంక్ష శర్మ కథానాయిక.  రామ్‌ నారాయణ్‌ దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టి, తొలి పాటను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి  సోను మోడల్‌ ఫుల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు హీరో విశ్వక్‌సేన్‌ స్వయంగా రాయగా, లియోన్‌ జేమ్స్‌ స్వరపరిచారు. నారాయణ్‌ రవిశంకర్‌, రేష్మా శ్యామ్‌ ఆలపించారు.

విశ్వక్‌సేన్‌ పోషించిన సోను  పాత్ర తీరుతెన్నులను ప్రజెంట్‌ చేస్తూ ఈ పాట సాగింది. తన ప్రత్యేకమైన స్కిల్‌తో అమ్మాయిల మనసుల్ని సోనూ ఎలా గెలుచుకుంటాడో ఈ పాట చెబుతుంది. విశ్వక్‌సేన్‌లోని ఎనర్జీ, అతని డైనమిక్‌ డాన్స్‌ మూమెంట్స్‌ ఈ పాటకు హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. వాలంటైన్‌ డే కానుకగా ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి రచన: వాసుదేవమూర్తి, కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్‌, నిర్మాణం: షైన్‌ స్క్రీన్స్‌.

Social Share Spread Message

Latest News