Skip to main content

Namaste NRI

అమెరికాలో మళ్లీ కలకలం… నిన్న డ్రోన్స్‌.. నేడు రెడ్‌ ఆర్బిట్స్‌

అమెరికాలో మళ్లీ వింత వస్తువులు ఆకాశంలో సంచరించటం తీవ్ర కలకలం రేపింది. ఆ దేశ గగనతలంలో అంతు చిక్కని డ్రోన్ల సంచారం ఇటీవల మిస్టరీగా మారింది. ఇవి కనిపించిన ప్రాంతంలోనే తాజాగా ఆకాశంలో గోళాకారంలోని ఎర్రటి వస్తువులు సంచరించటం కొంతమంది కంటపడ్డాయి. తమకు ఆకాశంలో రెడ్‌ ఆర్బిట్స్‌ కనిపించాయని తూర్పు అమెరికాలో పలువురు చెప్పటం సంచలనంగా మారింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికుడు రెడ్‌ ఆర్బిట్స్‌ ను వీడియో తీశాడు.  లాస్‌ వెగాస్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా ఆ రోజు (డిసెంబర్‌ 27న) రాత్రి 9.30 గంటలకు న్యూజెర్సీ మీదుగా రెండు రెడ్‌ ఆర్బిట్స్‌ ను చూశాను అని తెలిపారు.  ఇవి నిజమైన యుఎఫ్‌వో లు కాదంటూ ప్రభుత్వం చెబుతున్నది.

Social Share Spread Message

Latest News