Skip to main content

Namaste NRI

చైనా మరో అద్భుతం… 400 కిలోమీటర్ల పొడవుతో

సౌర విద్యుదుత్పత్తి రంగంలో చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేస్తున్నది. ఇన్నర్‌ మంగోలియాలో  సీ ఆఫ్‌ డెత్‌ గా ప్రాచుర్యం పొందిన కుబుకి ఎడారిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును సోలార్‌ గ్రేట్‌ వాల్‌ అని పిలుస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఐదు కిలోమీటర్ల వెడల్పు, 400 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది.

ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి సరిపడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. రాజధాని బీజింగ్‌కు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. నాసాకు చెందిన ఓఎల్‌ఐ, ఓఎల్‌ఐ-2 ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి తీసిన చిత్రాల్లో ఈ కొత్త సౌర విద్యుత్తు ప్రాజెక్టు స్పష్టంగా కనిపిస్తున్నది.

Social Share Spread Message

Latest News