Skip to main content

Namaste NRI

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ రిలీజ్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్‌.  శివుడి నేపథ్యంలో భక్తి ప్రధానంగా తెరకెక్కించిన నమో నమః శివాయ పాటను విడుదల చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. నమో నమః శివాయ పాటకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాల్ని సమకూర్చగా, జొన్న విత్తుల సాహిత్యాన్ని అందించారు. అనురాగ్‌ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు.  శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతుల్ని అందించారు. కళాత్మక, ఆధ్యాత్మికత కలబోతగా మహా శివుడి నామస్మరణతో ఈ పాట భక్తి భావాలను మేల్కొలిపే విధంగా సాగింది. నాగచైతన్య, సాయిపల్లవి చక్కటి నృత్యాలతో మెస్మరైజ్‌ చేశారు. సర్వశక్తివంతుడైన శివుడి ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాటను తెరకెక్కించామని, సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు.  మత్య్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానాంశాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News