భారత సంతతి నేత, ఎంపీ చంద్ర ఆర్య కెనడా ప్రధాని పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మన దేశాన్ని పునర్నిర్మించడం కోసం, భావి తరాలకు సౌభాగ్యాన్ని అందజేయడం కోసం చిన్న, మరింత సమర్థవంతమైన ప్రభుత్వాన్ని నడపటానికి నేను తదుపరి ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నాను అని తెలిపారు. చంద్ర ఆర్య కర్ణాటకలోని తుమకూరు జిల్లా, సిరా తాలూకా, ద్వర్లు గ్రామానికి చెందినవారు. జస్టిన్ ట్రూడో ఇటీవల ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.