Namaste NRI

ఒకేసారి మూడు బాణాలు వేసే నేర్పరి.. త్రిబాణధారి

సత్యరాజ్‌, వశిష్ట ఎన్‌ సింహ, సాంచి రాయ్‌, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటిస్త్ను చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. మోహన్‌శ్రీవత్స దర్శకత్వం.  ఈ చిత్రాన్ని వానర సెల్యూలాయిడ్‌ పతాకంపై విజయ్‌పాల్‌ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో మూడు బాణాలు సంధించడంలో నేర్పరి అయిన బార్బరికుడి స్ఫూర్తితో ఈ సినిమాకు త్రిబాణధారి అనే పేరు పెట్టామని, పౌరాణిక పాత్ర నేటి ప్రపంచంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందనే ఫాంటసీ ఎలిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు.ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్‌ రమేష్‌ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్‌ బ్యాండ్‌, సమర్పణ: మారుతి టీమ్‌ ప్రొడక్ట్‌, రచన-దర్శకత్వం: మోహన్‌ శ్రీవత్స.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events