అమెరికా సెకండ్ లేడీ, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరి వాన్స్‌పై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రమాణస్వీకారం తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. చాలాకాలంగా జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు తెలిపాను.వాన్స్ గొప్ప సెనేటర్. ఆయన భార్య ఉషా చాలా తెలివైన వారు. ఉపాధ్యక్షురాలిగా ఉషానే ఎంపిక చేసుకోవాల్సి ఉన్నా కుదరలేదు. వాన్స్ దంపతులిద్దరూ గొప్పవారు అంటూ ట్రంప్ పొగడ్తల జల్లు కురిపించారు. కాగా, అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగువారే అన్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మీ చిలుకూరి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు.