Namaste NRI

తండేల్ నుంచి హైలెస్సో.. హైలెస్సా.. మరో క్రేజీ సాంగ్ 

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్‌. చందూ మొండేటి దర్శకత్వం.  ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్య్సకారుల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్‌ కాగా, ఈ నెల 23న ప్రేమగీతం హైలెస్సో హైలెస్సా విడుదలకానుంది. ఈ సందర్భంగా పాట తాలూకు పోస్టర్‌ను విడుదల చేశారు. సాగరతీరంలో నాయిక సాయిపల్లవి నృత్యం చేస్తుండగా, నాగచైతన్య చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాల్ని అందించిన ఈ పాట హృద్యమైన ప్రేమగీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events