Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ రాకతో …పురోగతిపై ఆశలు !

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ వరకూ భారత్‌ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దేశీయ ఉత్పత్తులకు అమెరికాలో ఆరోగ్యకరమైన గిరాకీ ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం డిసెంబర్‌ నెలలోనే ఎగుమతులు 8.49 శాతం వృద్ధి చెంది ఏడు బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. మరోవైపు, అమెరికా నుంచి దిగుమతులు 1.91శాతం పెరిగి 33.4 బిలియన్‌ డాలర్లకు చేరితే, డిసెంబర్‌ లోనే 9.88 శాతం వృద్ధితో 3.77 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. మున్ముందు భారత్‌, అమెరికా మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కింద 93.4 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇదే కాలంలో భారత్‌- చైనా మధ్య 94.6 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టడంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. 2021-22 నుంచి భారత్‌కు అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events