Namaste NRI

కువైట్‌లో ఘనంగా.. రిపబ్లిక్ డే వేడుకలు

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఇండియన్‌ ఎంబసీలో (జనవరి 26న) 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కువైట్‌లోని భారతీయ కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.ఈ సందర్భంగా భారత రాయబారి డాక్టర్  హెచ్. ఇ. ఆదర్శ్ స్వైకా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అంతకుముందు రాయబార కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

భారత దేశం, కువైట్‌ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని ఈ సందర్భంగా స్వైకా గుర్తుచేశారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు రాయబార కార్యాలయం అన్ని వేళలా సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. భారతీయులకు సహాయం అందించడానికి రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మీ సహాయం కోసం మా వద్ద 24 గంటల వాట్సాప్ నంబర్‌లు ఉన్నాయి. మీ పరిష్కారం కాని ఏవైనా సమస్యలను వినడానికి మా వారపు బహిరంగ సభలో నేను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటాను  స్వైకా చెప్పారు. భారతీయ పౌరులందరూ ఈ దేశ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన ఇండో-కువైట్‌ సంబంధాన్ని మరింత పెంచిందని స్వైకా తెలిపారు. అనంతరం భారతీయ కమ్యూనిటీ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events