కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే పనిని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన బైఅవుట్లు ప్రకటించారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల జీతం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ మానవ వనరుల సంస్థ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఒక మెమో జారీ చేసింది. ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.సుమారు 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ-మెయిళ్లు పంపింది. ఉద్యోగాన్ని వీడాలనుకునే వారికి 8 నెలల జీతాన్ని చెల్లిస్తామని, వారు తమ నిర్ణయాన్ని ఫిబ్రవరి 6 లోగా తెలియజేయాలని పేర్కొంది.