ఫోర్బ్స్ 2025లో ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. 2025 నాటి ఈ కొత్త జాబితాలో అమెరికా టాప్-10లో అగ్రస్థానంలో ఉండగా.. ఇజ్రాయెల్ 10వ స్థానంలో ఉంది. అయితే భారత్ టాప్ -10లో లేకపోవడంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ర్యాంకింగ్స్ ను విడుదల చేసేటప్పుడు అనేక పారామితులను పరిగణనలోకి తీసుకుంటామని ఫోర్బ్స్ స్వయంగా పేర్కొంది, అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, నాల్గవ అతిపెద్ద సైనిక శక్తి, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాన్ని వదిలివేయడం అర్థం చేసుకోలేనిదని నిపుణులు వాదిస్తున్నారు. ఫోర్బ్స్ పేర్కొన్న చాలా పారామితులలో భారత్ అగ్రస్థానంలో ఉండడం గమనార్హం.