Namaste NRI

భారత సంతతి గాయనికి గ్రామీ పురస్కారం

సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే 67వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుక‌కు దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల‌తో పాటు సింగ‌ర్స్ హాజ‌రై సంద‌డి చేశారు. ఇక ఈ అవార్డు వేడుక‌ల‌లో భార‌త సంతతికి చెందిన ఇండో-అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌  అవార్డు అందుకుంది. చంద్రిక రూపొందించిన త్రివేణి అనే ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్  ఆల్బ‌మ్‌గా అవార్డును ద‌క్కించుకుంది. ఉత్తమ లాటిన్ పాప్ ఆల్బమ్‌కి గాను పాప్ సింగ‌ర్ షకీరా అవార్డును అందుకోగా.. ఉత్తమ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ విభాగంలో చార్లీ XCX అవార్డును ద‌క్కించుకుంది.

Social Share Spread Message

Latest News