భారత్ రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలక పాత్రపోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. టైటిల్ పోరుతో భారత విజయంలో గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. సంచలన బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ గొంగడి త్రిష(33 బంతుల్లో 8×4తో 44 నాటౌట్) అదరగొట్టింది. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసింది. అయితే ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసిసి, టోర్నీ ఆఫ్ ది టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. త్రిషతో పాటు జి. కమలిని, ఆయుషీ శుక్లా, వైష్ణవి శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు.
ఈ టోర్నీ లో 11 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను సారథిగా ఎంపిక చేసింది. ఈ టోర్నీలో గొం గడి త్రిష 77.25 సగటుతో 309 పరుగులు చేసింది. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉంది. టోర్నీ టాపర్‌గా నిలవడమే కాకుం డా, బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. మరో భారత ప్లేయర్ జి కమలిని 35.75 సగటుతో 143 పరుగు లు చేసింది. ఆయుషి శుక్లా 14 వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ 17 వికెట్లు పడగొట్టింది.