ప్రధాని నరేంద్ర మోడీని అక్కినేని ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిసింది. పార్లమెంట్లో కింగ్ నాగార్జున దంపతులు, నాగ చైతన్య దంపతులతోపాటు అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా, ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)