అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యుఎస్ఎఐడి) లోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాజాగా బ్రేక్ పడింది. అమెరికా లోని ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని యూఎస్ఏఐడీ ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అసోసియేషన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జడ్జి పేర్కొన్నారు. అంతేకాక, ఇప్పటికే సెలవులో ఉన్న యూఎస్ఏఐడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)