Skip to main content

Namaste NRI

ఈ సినిమా అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది

పుష్ప సినీ ప్రయాణంలో ఐదు నిమిషాల నుంచి ఐదేండ్ల వరకూ భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సక్సెస్ క్రెడిట్ దర్శకుడు సుకుమార్తో పాటు సినిమా కోసం కష్టపడి పనిచేసిన టీమ్కు దక్కుతుంది. ఆయన సీన్ చెప్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమా కోసం వెచ్చించిన ఐదేళ్లు నాకెంతో ప్రత్యేకం. ఈ సినిమా అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. పుష్ప 3 ఓ అద్భుతం అని పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ సలహాతోనే పుష్ప మూడు భాగాలుగా తయారైంది. ఈ విజయం మైతీ మూవీ మేకర్స్కి అంకితం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను ఎక్కువగా నమ్మే వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పారు. ఈ సినిమా విజయం ఎంతో మంది కష్టంతో వచ్చింది. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ సినిమా అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని అనుకున్నాం కానీ, ఇంత ఘనవిజయం సాధిస్తుందని అనుకోలేదు అని తెలిపారు.

Social Share Spread Message

Latest News