భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కోసం ప్యారిస్కు చేరుకున్నారు. ఫిబ్రవరి 12 నుండి 14 వరకు ఫ్రాన్స్, అమెరికాల్లో ఆయన పర్యటించనున్నారు. ఫ్రాన్స్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన, ఆ తర్వాత అమెరికాకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ ప్యారిస్ చేరుకున్న సందర్భంగా భారతీయ సముదాయం ఘనస్వాగతం పలికింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి వారు సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు. భవిష్యత్ టెక్నాలజీపై భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించే అవకాశం ఉంది. ఇది ప్రధాని మోదీ ఆరవసారి ఫ్రాన్స్ పర్యటన కావడం విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)